
814views
తూర్పు లద్దాఖ్‌లో సైనికుల మధ్య ఘర్షణ తర్వాత.. చైనాతో ఆచితూచి వ్యవహరిస్తున్న భారత్.. భద్రతా బలగాలను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతోంది. 12వ విడత చర్చల తర్వాత తూర్పు లద్దాఖ్‌లో గోగ్రా పోస్ట్ నుంచి చైనా, భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ.. పొరుగుదేశం ఎప్పుడు ఏ కొర్రీ పెట్టినా ధీటుగా స్పందించే ఏర్పాట్లను కేంద్రం ఇప్పటికే చేసింది. చైనాతో సరిహద్దుల వద్ద గస్తీ కాస్తున్న భారత బలగాలకు కేంద్రం అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చింది. అమెరికన్ సిగ్ సావర్ 716 అసాల్ట్ రైఫిళ్లు, స్విస్ ఎంపీ-9 పిస్తోళ్లను సైన్యానికి సమకూర్చింది. లద్దాఖ్ వద్ద చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి న్యోమా వద్ద కాపలా కాస్తున్న బలగాలకు ఈ ఆయుధాలు అందించినట్లు భారత సైన్యం వెల్లడించింది.





