
593views
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో వెండి పతకం చేరింది. రవి కుమార్ దహియా అద్భుత పోరాటంతో రెజ్లింగ్ 57 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతంతో మెరిశాడు. రెండు సార్లు ప్రపంచ విజేత అయిన రష్యాకు చెందిన యుగేవ్ జావుర్ చేతిలో పోరాడి ఓడినా దేశానికి మరో పతకం తీసుకొచ్చాడు. జావుర్ యుగేవ్ తో తలపడటం అంత సులభం కాదని తెలిసినా దేశానికి బంగారు పతకం తేవడమే లక్ష్యంగా బరిలోకి దిగి తన శక్తినంతా ధారపోసినా విజయం వరించలేదు. ఈ రసవత్తర పోరులో వెండి పతకం సాధించి యావత్ దేశ ప్రజల ప్రశంసలు అందుకొంటున్నాడు రవి కుమార్ దహియా.





