News

నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో అర్చక దంపతులకు “లక్ష్మీ నారాయణ సేవ”

422views

సేవ చేయడంలో, సంస్కృతీ సాంప్రదాయాలను సమాజానికి పరిచయం చేయడంలో ముందు వరుసలో నిలబడే కర్నూలు జిల్లా, నంద్యాల, సంఘమిత్ర సేవా సమితి నిరాశ్రిత బాలుర ఆవాసంలో “లక్ష్మీ నారాయణ సేవ'” పేరుతో శ్రీమతి, శ్రీ చామర్తి వెంకటరామయ్య దంపతుల సౌజన్యంతో 48 మంది అర్చక దంపతులకు వస్త్రాలను సమర్పించుకుని సత్కరించుకోవడం జరిగింది.

నంద్యాల పరిసర ప్రాంతాలలో దేవాలయాలు నిర్వహిస్తూ, స్వామి వారికి నిత్య పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ, హైందవ మత శ్రద్ధా కేంద్రాలను సజీవంగా ఉంచుతున్న అర్చకులు కరోనా నిబంధనల కారణంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో, దాతల సహకారంతో గతంలో వారికి నిత్యావసరాలు అందించడం జరిగింది.

ప్రస్తుతం “లక్ష్మీ నారాయణ సేవ” పేరుతో 48 మంది అర్చక దంపతులకు చీర, రవిక, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పంచ, టవల్ లాంటి వస్త్రాలను సాంప్రదాయ బద్దంగా పూజ చేసి వారికి సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ భగవంతుని సేవలో నిరంతరం మమేకమై అన్య మెరుగని అర్చకులను సేవించడం తమకు దేవుడిచ్చిన వరం గా అభివర్ణించారు. డాక్టర్ ఖాదర్ బాద్ ఉదయ శంకర్ గారు హైందవ సాంప్రదాయాల వైశిష్ట్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల పరిసరప్రాంతాల పరివారం క్షేత్రాల కార్యకర్తలు దంపతీ సమేతంగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు .

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.