తమిళనాడు : వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించి, అతని ఇంటి ప్రహరీ గోడను కూల్చిన పోలీసులు – చర్చి అక్రమణపై ఫిర్యాదు చెయ్యడమే అతను చేసిన పాపం

తమిళనాడు పోలీసులు వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించడమే కాకుండా అతని ఇంటి ప్రహరీ గోడను కూడా పోలీసులు కూల్చివేశారు.
అతను చేసిన పాపమల్లా తన ఇంటి ప్రక్కన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న చర్చిపై అధికారులకు ఫిర్యాదు చేయడమే. వ్యక్తి ఫిర్యాదుకు స్పందించి అక్రమ చర్చి నిర్మాణంపై చర్యలు తీసుకోవలసిన పోలీసులు అందుకు విరుద్ధంగా ఫిర్యాదు చేసిన వ్యక్తినే ఇబ్బందులకు గురిచేసిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తమిళనాడులోని టెన్ కాశి జిల్లాలోని కడయం సమీపంలోని పులవనూరు గ్రామ నివాసి, ఆటో డ్రైవర్ చెల్లాదురై ఇంటికి సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ చర్చిని నిర్మిస్తున్నారు. చెల్లాదురై అక్రమ చర్చి నిర్మాణానికి వ్యతిరేకంగా అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారులు, పోలీసులు ఎవరూ స్పందించలేదు.
అనంతరం కొంతమంది గూండలు చెల్లాదురై ఇంటిపై దాడి చేసి ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఇంటి ప్రహరీ గోడును కూడా పాక్షికంగా ధ్వంసం చేశారు. అతని జీవనాధారమైన ఆటోను కూడా ఆ గూండాలు ధ్వంసం చేశారు. దానిపై కూడా చెల్లాదురై చేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు.
అనంతరం చర్చి వర్గాలు చెల్లాదురైపై కౌంటర్ కేసును దాఖలు చేశాయి. వెను వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రఘురాజన్ చెల్లాదురై ఇంటి ముందు ఎగురుతున్న కాషాయ జెండాను వెంటనే తొలగించవలసిందిగా చెల్లాదురై కుటుంబ సభ్యులను ఆదేశించారు. జెండా ఏం నేరం చేసిందని ప్రశ్నించగా, ఎస్ ఐ వారిని బెదిరించారు. దాంతో భయపడిన చెల్లాదురై ఇంటి ముందు ఉన్న కాషాయ జెండాను తొలగించారు. అయితే పోలీసులు అంతటితో ఆగక చెల్లాదురై ఇంటి ప్రహరీ గోడను జెసిబితో కూల్చివేశారు.
A Hindu family is forced to remove saffron flag from their house, got beaten by police & house bulldozed.
This incident is not from Pakistan but an Indian state Tamilnadu. pic.twitter.com/HV0GRFSMGW
— Mr Sinha (@MrSinha_) July 30, 2021
దీంతో గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహించారు. రోడ్డుకు అడ్డంగా పోలీసులను వెళ్లనివ్వకుండా ధర్నాకు కూర్చున్నారు. అక్రమ చర్చి నిర్మాణంపై మేం ఫిర్యాదు చేసినప్పుడు ఏ మాత్రమూ స్పందించని మీరు ఇప్పుడు మాత్రం వెంటనే మాపై చర్యలకు ఉపక్రమించారేమిటి? ఇది మీ పక్షపాత వైఖరికి నిదర్శనం కాదా? అని ప్రజలు పోలీసులను నిలదీశారు. అందుకు ఎస్ ఐ రఘురాజన్ మీపై కేసులు బనాయించి బొక్కలో వేస్తానంటూ వారిని బెదిరించారు. ఈ మొత్తం సంఘటనను స్థానికులు ఈ వీడియోలో చిత్రీకరించారు.
జరిగిన ఘటనపై హిందూ ముణ్ణని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లాదురైకి అనేక విధాలుగా హిందూ ముణ్ణని నాయకులు అండగా నిలిచారు. హిందూ ముణ్ణని నాయకుల జోక్యంతో ఎట్టకేలకు పోలీసులు చెల్లాదురైపై దాడి చేసిన కొందరు క్రైస్తవ గూండాలను అరెస్ట్ చేశారు. చెల్లాదురైకి న్యాయం జరిగేవరకూ ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని హిందూ ముణ్ణని నాయకులు స్పష్టం చేశారు.
Source : OPINDIA.





