News

కరోనా వేళ ఇండోనేషియాకు భారత్ సాయం – జకార్తా చేరుకున్న భారత నౌక ఐరావత్

704views

భారత్ నుండి 5 క్రయోజనిక్ కంటైనర్లతో, వంద మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇతర సామగ్రితో ఇండోనేషియా రాజధాని జకార్తాకు ఐఎన్ఎస్ ఐరావత్ చేరుకుంది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సాయంలో భాగంగా భారత్ వీటిని పంపింది.

హిందూ మహా సముద్ర ప్రాంతంలో సాంస్కృతిక సారూప్యం ఉన్న దేశాలు కావడంతో ఈ ప్రాంతాన్ని వాణిజ్య నౌకలకు పూర్తి భద్రత కల్పించేట్టుగా రెండు దేశాలూ జాగ్రత్త వహిస్తున్నాయి. కోవిడ్ బాధితులకు సహాయం అందించడంలో భారత్ ఉదారంగా తన వంతు సాయంగా ఈ పరికరాలను అందించింది. హిందూ మహా సముద్ర పరిసరాల్లో శాంతి పరిరక్షణకు రెండు దేశాల నౌకాదళాలు గట్టిగా కృషి చేయాలని మరోసారి నిర్ణయించుకున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.