
812views
గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాలం చెల్లిన పాత చట్టాల్లో ఒకటని, ఓట్ల కోసమే భాజపా ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని నోరు పారేసుకున్నారు. “హిందువులకు గోవు పూజ్యనీయమైనదని, కానీ ముస్లింలకు అదే ఆహారము” అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అధికార మదంతో కన్నూ మిన్నూ గానక వ్యాఖ్యానిస్తున్నారని హిందువులు, హిందూ సంఘాల నాయకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





