News

మెదడుకు శస్త్రచికిత్స చేస్తుంటే హనుమాన్ చాలీసా పారాయణ.. ఆశ్చర్యపోయిన ఎయిమ్స్ వైద్యులు

529views

స్త్రచికిత్స ద్వారా మెదడులో కణతిని తొలగిస్తుండగా.. తనకేమీ జరగనట్లు హనుమాన్​ చాలీసా పారాయణ చేసుకున్నారో మహిళ. ఆమె మధ్యలో తప్పు పలికగా ఆపరేషన్​ చేస్తున్న వైద్యుడొకరు సహకరించారు. ఇదంతా దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రిలో జరిగింది.

‘క్రేనియోటమీ’ శస్త్రచికిత్స విధానం ద్వారా ఆమెకు కేవలం కణతి ఉన్న ప్రాంతంలోనే మత్తు ఇచ్చి ఎడమ వైపున కణతిని తొలగించారు. అనంతరం ఆమె ఏమీ కానట్లు తల.. అటూ ఇటూ ఊపుతూ ఆపరేషన్​ థియేటర్​ నుంచి బయటకు వచ్చారు. ఈ ఆపరేషన్​కు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న వైద్య సిబ్బంది ఒకరు ఫోన్​ రికార్డు చేసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్​గా మారింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.