News

జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదులతో భద్రతాదళాల ముమ్మర పోరు – రెండు నెలల్లో 98 మంది హతం

551views

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గత రెండు నెలల్లో 98 మంది ముష్కరులు ప్రాణాలు కోల్పోయినట్లు సీనియర్​ పోలీసు అధికారి తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు 62 ఉగ్రవాద ఘటనలు జరగగా 129 మంది మరణించారు. అందులో 12 మంది పౌరులు, 19 మంది భద్రతా సిబ్బంది… 98 మంది ఉగ్రవాదులు మరణించారు. ఒక్క జులైలోనే 28 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ఈ 62 ఉగ్రవాద ఘటనల్లో 32 మే 1న కొవిడ్ కర్ఫ్యూ తర్వాతే జరగటం గమనార్హం. గత ఏడాది మే నెలలో 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్లో 48, జులైలో 20 మంది మృతి చెందారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.