News

ఉగ్రవాదానికి ఆకర్షితులైన 14 మంది యువకులను తల్లిదండ్రులకు అప్పగించిన జమ్ము పోలీసులు

596views

ముష్కర మూకతో చేతులు కలిపేందుకు సిద్ధమైన 14 మంది యువకుల మనసును పోలీసులు మార్చారు. కౌన్సిలింగ్​ ఇప్పించి వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న ఈ యువకులు స్థానిక ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్థాన్​కు చెందిన ఉగ్రసంస్థల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరిని అనంత్​నాగ్​ జిల్లా పోలీసులు గుర్తించి తమ తల్లిదండ్రులకు మంగళవారం అప్పగించారు. ఈ కార్యక్రమంలో అనంత్​నాగ్​ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

కొన్ని రోజుల క్రితమే ఈ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి వీరికి కౌన్సిలింగ్​ ఇచ్చారు. తమ పిల్లలు ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని అనంతనాగ్ ఎస్ ఎస్ పీ ఇంతియాజ్ హుస్సేన్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.