
384views
చైనాలో వరదలు పోటెత్తాయి. ఈనెల 17నుంచి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలు… డెంగ్‌ఫెంగ్ నగరాన్ని ముంచెత్తాయి. భీకరమైన వరదల కారణంగా వివిధ ఘటనల్లో 12 మంది మరణించారు. దాదాపు లక్షన్నర మందిపై వరదల ప్రభావం పడింది. 10వేల మందికిపైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గడచిన వందేళ్లలో ఎప్పుడు లేనంత వర్షం కురిసినట్లు చైనా వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ వరదలతో వందల కోట్ల ఆర్థికనష్టం వాటిల్లినట్లు అధికారవర్గాలు తెలిపాయి.





