
456views
పశ్చిమబెంగాల్ భాజపా నేత, నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఎన్నికను సవాల్ చేస్తూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. కలకత్తా హైకోర్టు మినహా ఏ హైకోర్టుకైనా బదిలీ చేయాలని అభ్యర్థించారు. అంతకుముందు సువేందు ఎన్నికపై మమత దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం కలకత్తా హైకోర్టులో విచారణ జరిగింది. నందిగ్రామ్ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, పేపర్లను భద్రపరచాలని ఎన్నికల సంఘానికి సూచించింది. సువేందు అధికారికి సైతం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 12కి వాయిదా వేసింది.





