
464views
ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర సోమవారం నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం కూడా గతేడాది మాదిరిగా భక్తులు లేకుండానే శ్రీక్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు వేడుక చేపట్టనున్నారు. ఆనవాయితీ ప్రకారం నందిఘోష్, తాళధ్వజ్, దర్పదళన్ రథాలపై జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుడు (చతుర్థామూర్తులు) శ్రీక్షేత్రం వీడి పెంచిన తల్లి గుండిచా మందిరానికి బయల్దేరుతారు. భక్తులు పూరీ రాకుండా రైళ్లు, బస్సులు నిలిపివేసి, పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు డీజీపీ అభయ్ తెలిపారు.





