News

ఆఫ్ఘనిస్థాన్ లోని భారత రాయబార కార్యాలయం మూసివేత

741views

ఫ్ఘనిస్థాన్‌ భూభాగంపై తాలిబన్లు పట్టుబిగుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం కాందహార్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అక్కడి దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని శనివారం రాత్రి ప్రత్యేక వాయుసేన విమానంలో భారత్ ‌కు తీసుకొచ్చారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

దక్షిణ ప్రాంతంలో, కాందహార్‌ చుట్టుపక్కల ప్రాంతాలపై తాలిబన్లు పట్టుబిగించారు. ఏ క్షణంలోనైనా మూకలు నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ భద్రతా బలగాలతో భీకర పోరు జరిగే అవకాశం ఉంది. అలాగే తాలిబన్ల నీడలో ఆశ్రయం పొందుతున్న లష్కరే తోయిబా ఉగ్రమూకల ప్రాబల్యం దక్షిణ ప్రాంతంలో అధికం. తాలిబన్లతో కలిసి వీరంతా ఆఫ్ఘన్‌ సేనలపై దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.