News

ఈ నెల 17 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం

779views

కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని ఈ నెల 17 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. జులై 21 వరకు జరిగే పూజా కార్యక్రమాల కోసం ఈ అవకాశం కల్పించారు. కరోనా వ్యాక్సిన్‌ పొందినట్లు ధ్రువపత్రం, ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది. ఆన్‌లైన్‌ టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని.. 5 వేల మందికి మాత్రమే దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.