
790views
రోదసియానం చేయనున్న తొలితెలుగు మహిళగా గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష చరిత్ర సృష్టించనున్నారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్ యూనిటీ-22ని నింగిలోకి పంపనుంది. అందులో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్తో పాటు మరో అయిదుగురు ప్రయాణించనుండగా వారిలో 34ఏళ్ల శిరీష కూడా ఉన్నారు.
శిరీష వ్యోమనౌకలో పరిశోధన అంశాలను పర్యవేక్షించనున్నారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈ యాత్ర విజయవంతమైతే భారత్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకెక్కనున్నారు. ఇంతకుముందు రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్ సునీతా విలియమ్స్ రోదసిలోకి వెళ్లి వచ్చారు.





