
588views
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు నుండి అమ్మవారికి ఆషాడసారె కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య ఆలయ అర్చకులు అమ్మవారికి మొదటి సారె సమర్పించడంతో ఆషాడ పవిత్ర సారె కార్యక్రమం ప్రారంభమవుతుంది.
భక్తులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అమ్మవారికి ఆషాడ సారె సమర్పించవచ్చు. సారె సమర్పణకు … భక్తులు ఆలయ కార్యాలయం ఫోన్ నెంబర్లు 9493545253, 8341547300 లను మూడు రోజులు ముందుగా సంప్రదించాలి. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి సమయం నిర్దేశిస్తారు… దానికి అనుగుణంగా భక్తులు సారెతో ఆలయానికి చేరుకోవాలి.





