News

అంతరిక్షంలో అద్భుతం.. కంటితో చూసే అవకాశం

364views

భూమికి పొరుగునున్న శుక్ర, అంగారక గ్రహాలు ఈ నెల 13న పరస్పరం దగ్గరగా వచ్చి ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. జులై 12న.. ఆ గ్రహాలకు దగ్గరగా చందమామ కూడా దర్శనమివ్వనుంది. ఎలాంటి సాధనాలు అవసరం లేకుండానే కంటితో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించొచ్చు.

ఆయా గ్రహాల కక్ష్య దృష్ట్యా.. అరుదైన సందర్భాల్లో ఇవి కనిపిస్తాయి. పరస్పరం అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు అంగారకుడు, శుక్రుడు మధ్య ఎడం 0.5డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఈ రెండు గ్రహాలు, చంద్రుడు పరస్పరం దగ్గరకు వచ్చే ప్రక్రియ గురువారం నుంచే కనపడుతోంది. జులై 13న మరింత దగ్గరగా కనిపిస్తాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.