News

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం… భయాందోళనలో ప్రజలు

683views

త్తర, ఈశాన్య భారతంలో తరచూ వస్తున్న భూకంపాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా మణిపూర్‌లో భూప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం తెల్లవారుజామున 5.56 గంటలకు మణిపూర్‌లోని ఉక్రుల్‌లో భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. ఉక్రల్‌కు 57 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. దీంతో తెల్లవారుజామున ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

బుధవారం అసోం, మేఘాలయా, ఉత్తర బెంగాల్‌లో భూప్రకంనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.2 తీవ్రత నమోదైంది. దీంతో అస్సాం, గోల్‌పారా, మేఘాలయా, ఉత్తర బెంగాల్, డార్జిలింగ్, కూచ్ బెహార్ వంటి ప్రాంతాల్లో భారీగా ప్రకంపనలు సంభవించాయి. ఇటీవల ఢిల్లీ, యూపీ, బీహార్ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.