News

దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన NIA

642views

ర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. యూపీలోని ఖైరానాకు చెందిన హాజీ సలీమ్‌, కాపిల్‌ను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ”దర్భంగా పేలుళ్ల వ్యవహారంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. ఫిబ్రవరిలో హాజీ సలీమ్‌ ఇంట్లో.. పేలుళ్ల వ్యవహారానికి సంబంధించి కుట్రపన్నారు. రైలులో పేలుళ్లతో ప్రాణనష్టం జరగాలని చూశారు. లష్కరే తొయిబా ఉగ్రవాది ఇక్బాల్‌కు హాజీ సలీమ్‌ సన్నిహితుడు. ఇక్బాల్‌ ఆదేశాలతోనే రైలులో పేలుడుకు కుట్ర జరిగింది. ఇక్బాల్‌ ఇచ్చిన నిధులతో సలీమ్‌ పేలుళ్లకు కుట్ర పన్నారు. గత నెల 30న ఇద్దరు నిందితులు నసీర్‌ఖాన్‌, ఇమ్రాన్‌ మాలిక్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి పట్నా తీసుకెళ్లాం” అని ఎన్‌ఐఏ తెలిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.