
కేరళలోని వాయలార్ కు చెందిన RSS స్వయంసేవక్ నందు కృష్ణ హత్య కేసులో నిందితుడు, SDPI కార్యకర్త నిహాస్ (40) ని కేరళలోని అలప్పుజ జిల్లా పూచక్కల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
PFI – SDPI గూండాలు 2021 ఫిబ్రవరి 24న నందుకృష్ణను హత్య చేశారు. ముందస్తు ప్రణాళికతోనే దుండగులు నందు కృష్ణను హత్య చేసినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఈ హత్యతో సంబంధమున్న 7గురు PFI – SDPI సభ్యుల అరెస్టు
బిజెపి తలపెట్టిన ‘విజయ యాత్ర’ సందర్భంగా కేరళకు వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాకను నిరసిస్తూ PFI – SDPI లు సంయుక్తంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలను నిర్వహించాయి. అదే సమయంలో హిందూ సంస్థల నాయకుల హత్యలకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో ఇద్దరు PFI సభ్యులని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను నిరసిస్తూ PFI నిర్వహించిన ప్రదర్శనలో హిందువులను, ఆర్ ఎస్ ఎస్, యోగి ఆదిత్యనాథ్ లను తీవ్రంగా దూషిస్తూ, రెచ్చగొట్టే నినాదాలు చేశారు PFI సభ్యులు.
PFI యొక్క అభ్యంతరకర ర్యాలీకి నిరసనగా RSS కార్యకర్తలు కూడా ఒక ర్యాలీని చేపట్టారు. ఆ ర్యాలీపై కత్తులతో దాడి చేసిన PFI గుండాలు నందుకృష్ణని హత్య చేశారు. ఆ దాడిలో మరో ముగ్గురు స్వయంసేవకులు తీవ్రంగా గాయపడ్డారు.
Source : Organiser.