News

కేరళ : స్వంత పార్టీ వారిపైనే బాంబులు విసిరిన PFI – SDPI గూండాలు

1.6kviews

ఆది నుంచి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తన అభ్యంతరకర వైఖరి కారణంగానే వార్తలలో నిలుస్తూ ఉన్న విషయం పాఠకులకు విదితమే. కేరళలోని పాదం అటవీ ప్రాంతంలో PFI సాయుధ శిక్షణా కేంద్రం నడుపుతోందనే సమాచారంతో దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగిస్తున్న సమయంలోనే PFI – SDPI గూండాలు తమలో తామే కలహించుకుని ఒకరిపై ఒకరు బాంబులు విసురుకున్న సంఘటన అదే పాదం అటవీ ప్రాంతంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సంఘటన PFI, SDPIలు తీవ్రవాద సంస్థలని వినవస్తున్న వార్తలకు మరింత బలం చేకూర్చేదిగా ఉంది.

ఫైజల్ రాజ్ నేతృత్వంలోని ముఠా సభ్యులు జుల్ఫికర్, నైజంల నేతృత్వంలోని మరో ముఠా సభ్యులపై బాంబులు విసిరారు. ఆర్థిక విషయాలలో వచ్చిన విభేదాలే పరస్పర దాడులకు కారణమని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటన జరిగిన పతనాపురం సమీపంలోనే సాయుధ శిక్షణ కేంద్రం ఉన్నదని సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.