
493views
గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్, తితిదే పాలకమండలి సభ్యులు కొలిశెట్టి శివ కుమార్ విజ్ఞప్తి చేశారు. గోహింస ఆగాలని, గో హత్యలు ఆపాలని, కబేళాలు మూసివేసేలా కూడా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. జాతీయ ప్రాణిగా గుర్తించడం సహా మిగిలిన అంశాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే తీర్మానం చేసిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.





