News

కరోనా చికిత్సలో కొత్త మందు – హైదరాబాద్ కంపెనీ తయారీ

594views

రోనాను అరికట్టేందుకు హైదరాబాద్ కంపెనీ బయోఫోర్ మరో ముందడుగు వేసింది. తాము తయారుచేసిన ‘అవిప్టాడిల్’ ఔషధానికి అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకున్నట్లు బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ శుక్రవారం కోరింది.డీజీసీఐ నుంచి అనుమతి లభించిన వెంటనే వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు బయోఫోర్ ప్రతినిధులు పేర్కొన్నారు. తమ ఔషధ వినియోగంతో కోవిడ్‌ సీరియస్‌ కేసుల్లో రోగులు వేగంగా కోలుకుంటున్నట్లు రుజువైనట్లు తెలిపారు. సీరియస్ కండిషన్‌లో చికిత్స పొందుతున్న రోగులు కోలుకోవడానికి ఈ ఔషధం ఉపయోగపడుతుందని క్లినికల్ టెస్టుల్లో నిరూపితం అయిందని కంపెనీ సీఈవో తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.