News

రేవుపోలవరంలో సముద్రతీరంలో వివేకానందుడి విగ్రహావిష్కరణ

492views

విశాఖ జిల్లా, ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సముద్రతీరంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థానిక యువత ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలోని ఉమామాధవ స్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామ యువత ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామి శ్రీనివాసానందను స్థానికులు సన్మానించారు. యువకుల కృషిని శ్రీనివాసానంద స్వామి అభినందించారు. యువతా మేలుకో అంటూ స్వామి వివేకానంద స్ఫూర్తిని వారిలో నింపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.