News

మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ… కేంద్ర పథకాలను అమలు చేయాలని ఆదేశం..

815views

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బెంగాల్ రాష్ట్రంలో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి సాకులూ చూపకుండా, రాష్ట్రంలో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఈ పథకం వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన పథకం. మీరు సమస్యలను ఉదహరించకుండా పథకాన్ని అమలు చేయాలి’’ అని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కారణాల రీత్యా సీఎం మమత బెంగాల్‌లో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, మమత పట్టించుకోలేదని బీజేపీ ఆరోపిస్తోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.