News

బెంగాల్ లో మొదలైన రాజకీయ కక్ష సాధింపు… సువేందు అధికారి, ఆయన సోదరుడి పై దొంగతనం కేసు….

855views

శ్చిమ బెంగాల్‌ బీజేపీ నాయకుడు సువేందు అధికారిపై కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన వస్తు సామగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కంతి మునిసిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బోర్డ్‌ సభ్యుడు రత్నదీప్‌ మన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రత్నదీప్ మన్నా ఈ నెల 1న ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మే 29న సువేందు అధికారి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి.. కంతి కార్యాలయ గోడౌన్‌లోకి అక్రమంగా చొరబడి లక్షల విలువచేసే సామగ్రిని దోచుకెళ్లారని అని మన్నా తెలిపారు. దొంగతనంలో బీజేపీ నేతలు కేంద్ర సాయుధ బలగాలను సైతం ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.