News

కేవలం 75 రూపాయలకే యాంటీ బాడీ టెస్ట్ కిట్ – DRDO సరిక్రొత్త ఆవిష్కరణ

582views

దేశవ్యాప్తంగా కొవిడ్‌ బారిన పడి కోలుకుంటున్న వారిలో యాంటీబాడీల స్థాయి పరీక్షించేందుకు డీఆర్‌డీవో రూపొందించిన పరీక్ష కిట్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు డీఆర్‌డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థతో కలిసి ‘డిప్కోవాన్‌’ పేరిట డీఆర్‌డీవో రూపొందించిన ఈ కిట్‌ కేవలం రూ.75కే అందుబాటులో ఉంటుందని, మనిషి శరీరంలో యాంటీబాడీలు ఏమేరకు ఉన్నాయో ఖచ్చితమైన ఫలితాన్నిస్తుందని పేర్కొన్నారు.

2 డీజీ డ్రగ్‌ కూడా సమర్థంగా పనిచేస్తున్నట్లు ఫలితాలొస్తున్నాయని, వారంలోగా హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ద్వారా 6 నుంచి 8 లక్షల 2 డీజీ పొట్లాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా మరిన్ని సంస్థల ద్వారా ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ నుంచే ముడి పదార్థాన్ని మరికొన్ని సంస్థలకు ఇచ్చి ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇంకో వారంలో దానిపై స్పష్టత వస్తుందని అన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.