NewsSeva

అవసరమైనవారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏర్పాటు చేస్తున్న సేవాభారతి

1.1kviews

కోవిడ్ విలయం సమయంలో సేవా భారతి దేశమంతటా అనేక సేవా ప్రకల్పాలతో పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ ఆక్సిజన్ అందక కొడిగడుతున్న అమూల్యమైన ప్రాణాలను కాపాడటానికి దేశ మంతటా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లను, ఆయుష్ – 64 మాత్రలను అందజేస్తున్నది.

విజయవాడ సేవాభారతి ఆధ్వర్యంలో ఆయుష్ 64 మందు పంపిణీని ప్రారంభిస్తున్న సేవా భారతి ట్రెజరర్
మరియు సేవాభారతి జాయింట్ సెక్రటరీ

అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న కరోనా బాధితులకు సేవాభారతి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేస్తున్నది.

అవసరం ఉన్నవారు స్థానిక సేవాభారతి ప్రతినిధులను సంప్రదించిన వెంటనే వారి రిపోర్టులను పరిశీలించి, సేవా కార్యకర్తలే స్వయంగా వారి ఇంటికి వెళ్లి దానిని వినియోగించే విధానాన్ని తెలియజేసి వస్తున్నారు.

నంద్యాలలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో కార్యకర్తలు

అవసరమున్నవారు తమ రిపోర్టులతో వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి, మోతాదు నిర్ణయించి వారికి సరిపడా ఆయుష్ – 64 మందుల కిట్టు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని సేవాభారతి తెలియజేస్తున్నది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.