News

రైతుల నిరసనల వల్ల గ్రామాల్లో కరోనా వ్యాప్తి – హర్యానా ముఖ్యమంత్రి

552views

సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరిగిపోతోందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. వేల సంఖ్యలో జనం గుమిగూడుతూ.. కొవిడ్ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. కొన్ని గ్రామాల్లో గతేడాది కన్నా ఎక్కువగా మరణాల రేటు నమోదైందని తెలిపారు.

రైతుల ఆందోళనల్లో పాల్గొన్నవారి గ్రామాల్లో, ధర్నాలు నిర్వహిస్తున్న గ్రామాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ గ్రామాల్లో గతేడాది కన్నా 6 నుంచి 10 శాతం మరణాల రేటు పెరిగింది. ఇది కరోనాతో కాదని వాదిస్తే.. ఇంకా ఏ మహమ్మారి ప్రస్తుతం లేదు. వేల సంఖ్యలో ఒకే దగ్గర గుమిగూడుతూ.. కొవిడ్ నిబంధనలు పాటించలేదని ఖట్టర్ పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.