News

ఆనందయ్య మందుపై అభ్యంతరమెందుకు?: చినజీయర్‌స్వామి

789views

“నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేవంటున్నారు.. దీంతో పాటు ఔషధాన్ని ఉచితంగా ఇస్తున్నప్పుడు అభ్యంతరం ఎందుకు?” అని చినజీయర్ స్వామి ప్రశ్నించారు. “ఓ మందు ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకు?” అని ఆయన అన్నారు. “సంక్షోభం వేళ వివాదాలకు తావివ్వకూడదు” అని ఆయన పేర్కొన్నారు. ఎర్రగడ్డలోని ఈఎస్ ఐ ఆస్పత్రిని స్వామిజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడారు.

ఒక వ్యక్తి చనిపోతుంటే ఆనందయ్య మందు ప్రాణం నిలబెడుతున్నప్పుడు ఎందుకు వివాదం అవుతోందని చినజీయర్‌స్వామీజీ అన్నారు. అలోపతి వైద్యాన్ని వ్యవస్థ అంగీకరించిందని.. కానీ మంచిని ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చని ఆయన వివరించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.