News

జయభారత్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి దాతల విరాళం

560views

సింహపురి వైద్య సేవా సమితి అధ్వర్యంలో నిర్వహిస్తున్న జయ భారత్ హాస్పిటల్లో కోవిడ్ పేషంట్స్ కి చేస్తున్న సేవలను గుర్తించి ఆక్సిజన్ కొరత తీర్చడానికి దాతలు ముందుకు వచ్చారు. DP గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు వారు CSR నిధుల క్రింద 23లక్షలు, చెన్నై కు చెందిన మద్రాస్ చిన్మయ సేవా ట్రస్ట్ వారు 24లక్షలు అందచేశారు. DP గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ వారి కుటుంబ సభ్యులు చెక్ ను సింహపురి వైద్య సేవా సమితి ట్రస్ట్ సభ్యులు గుర్రం సుధాకర్ గారు కి జైన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి JP జైన్ గారి సమక్షంలో అందచేశారు.

శ్రీ దిలీప్ కుమార్ గారు మాట్లాడుతూ నెల్లూరులోని కోవిడ్ పేషంట్స్ కు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో జయ భారత్ హాస్పిటల్ కు సహకరిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజులలో కూడా మా యొక్క సహాయం అందజేస్తామని తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణాన్ని బొంబాయికి చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, అతి త్వరలోనే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని హాస్పిటల్ జనరల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్ తెలిపారు. కోవిడ్ పేషంట్స్ కి ఆక్సిజన్ అందజేయడానికి ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీ జేపీ జైన్ , DP గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.