
842views
బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన్ కర్ కి కూచ్ బిహార్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు గవర్నర్ గురువారం ఇక్కడికి రాగా స్థానిక తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. కొన్ని చోట్ల ఆయన కాన్వాయ్ ని అడ్డగించారు.
దీనిపై స్పందించిన గవర్నర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని, ఈ పరిస్థితిని తాను ఏ మాత్రం ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్య వినాశనమేనని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు తమ ఇళ్ళు వదిలి అడవుల్లో ఉంటున్నారని, గూండాలు మళ్ళీ వచ్చి తమపై ఎక్కడ దాడి చేస్తారోనని బెంబేలెత్తిపోతున్నారని జగ దీప్ ధన్ కర్ తెలిపారు. అయితే సీఎం మమతా బెనర్జీ గవర్నర్ తీరుపై మండిపడ్డారు. గవర్నర్ పర్యటనలు నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు.





