News

ఇజ్రాయెల్ పై హమాస్ దాడులలో భారతీయ యువతి దుర్మరణం : సినీ, మీడియా ప్రముఖుల మౌనంపై వెల్లడవుతున్న ఆగ్రహావేశాలు

766views

జ్రాయెల్ పై హమాస్ తీవ్రవాదులు రాత్రి వరకు 1050 రాకెట్లు ప్రయోగించారు. ఈ దాడులలో భారతదేశపు కేరళకి చెందిన మహిళ సౌమ్యసంతోష్ (30) కూడా మృతి చెందారు. సౌమ్య సంతోష్ ఇజ్రాయెల్ లోని ఆష్కెలాన్ సిటీలో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది.. దేశభక్తులు, జాతీయవాదులు ఇజ్రాయెల్ పై జరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు.

భారతదేశంలో రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలని, ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా దాడులను ఆపాలని ఇలా రకరకాల కారణాలపై క్యాండిల్ ర్యాలీలు వగైరాలు నిర్వహించే భారతదేశంలోని ఒక వర్గం మేథావులు, ప్రముఖులు, అవార్డు వాపసీలు, సినీ ప్రముఖులు తదితరులెవరూ ఇజ్రాయెల్ పై హమాస్ జరిపుతున్న అమానుష దాడులలో మన దేశానికి చెందిన సౌమ్య సంతోష్ మరణించిన ఘటనపై కనీసం విచారం వ్యక్తం చెయ్యకపోవడాన్ని, కిమ్మనకపోవడాన్ని కొందరు తీవ్రంగా దుయ్యబడుతున్నారు.

దేశంలో మేథావులనబడే కొందరు, కొన్ని మీడియా సంస్థలు కొన్ని ప్రత్యేకమైన విషయాలపై మాత్రమే స్పందిస్తూ, ప్రత్యేకమైన విషయాలను మాత్రమే వెలుగులోకి తెస్తూ చాలా సెలెక్టివ్ గా వ్యవహరిస్తూ ఉన్నారని, వారి పక్షపాత వైఖరి దేశ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నదని కొందరు దుయ్యబడుతున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.