News

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

283views

మ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అల్‌బగర్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హదీపొరా ప్రాంతంలో గుర్తుతెలియని ముష్కరులు నక్కినట్లు వచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు శనివారం ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు సైనికులపైకి కాల్పులు జరిపారు. వాటిని తిప్పికొట్టే క్రమంలో.. సైన్యం ఎదురు కాల్పులు జరపగా ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. అయితే ఉగ్రవాద సంస్థలో ఇటీవల కొత్తగా చేరిన వ్యక్తిని లొంగిపోవాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అతడి తల్లిదండ్రులను తీసుకువచ్చి మరీ వెనక్కి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ, ఇతర ముష్కరులు అతడిని బయటకు రానివ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

గురువారం కూడా షోపియాన్‌లోనే సైన్యం, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఐదుగురు ముష్కరులు మరణించారు. వారిలో ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థ నేత ఇంతియాజ్‌ షా ఉన్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.