కాశీ జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇద్దరు ముస్లిములతో కూడిన 5 మంది సభ్యుల బృందంతో సర్వే చెయ్యడానికి అనుమతి.

జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో పురావస్తు శాఖ సర్వే నిర్వహించడానికి వారణాసి జిల్లా కోర్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ని అనుమతించింది. నిజానికి కాశీ విశ్వనాథ్ ఆలయం మీద ఈ మశీదును నిర్మించారు.
1664 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 2000 సంవత్సరాల నాటి కాశి విశ్వనాథ్ ఆలయంలో కొంత భాగాన్ని తొలగించి జ్ఞానవాపి మశీదు నిర్మించటానప్పటి నుండి జ్ఞాన్వాపి మసీదు ఉన్న భూమి కోసం హిందువులు కోరుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ భూమిని తిరిగి హిందువులకు అప్పజెప్పాలని కోరుతూ స్థానిక న్యాయవాది వి.ఎస్.రాస్తోగి జిల్లా కోర్టులో దావా వేశారు.
ఈ దావాను జ్ఞాన్వాపి మసీదు కమిటీ సవాలు చేయగా, వారణాసి జిల్లా కోర్టు ఇప్పుడు మశీదు కాంప్లెక్స్ లో పురావస్తు సర్వేను అనుమతించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, సర్వే యొక్క అన్ని ఖర్చులను ఉత్తర పెరదేశ్ ప్రభుత్వం చెల్లించాలి.
ముస్లిం సమాజానికి చెందిన ఇద్దరు సభ్యులతో కూడిన 5 మంది సభ్యుల కమిటీ ఈ సర్వే చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం.
Source : OPINDIA





