News

బెంగాల్‌ భాజపా అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి

533views

న్నికల వేళ పశ్చిమ్‌బెంగాల్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కాన్వాయ్‌పై దాడి జరిగింది. కూచ్‌బెహర్‌ వద్ద దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దిలీప్‌ఘోష్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దారుణ స్థితిలో ఉందని దిలీప్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు తమ వాహనాలతో పాటు కొంతమంది కార్యకర్తలపైనా దాడి చేశారని విమర్శించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.