News

కనకదుర్గమ్మ గుడి ఈవో బదిలీ

557views

విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఈవో ఎంవీ సురేశ్‌బాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రాజమహేంద్రవరం జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబను నియమించింది. సురేశ్‌బాబును రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా పంపించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది. దుర్గ గుడి ఈవోగా భ్రమరాంబ తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.

దుర్గ గుడిలో అవినీతి జరుగుతోందంటూ వచ్చిన ఆరోపణలపై ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు ఏసీబీ ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈవో సురేశ్‌బాబు తీవ్రమైన ఆర్థిక తప్పిదాలకు పాల్పడినట్లు ఏసీబీ తమ తనిఖీల్లో గుర్తించింది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ క్రమంలోనే దుర్గ గుడి ఈవోను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.