News

నందిగ్రామ్ : బిజెపి కార్యకర్త భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ తృణమూల్ కాంగ్రెస్ గుండాలు : సీఎం మమతా బెనర్జీ ఇంటికి సమీపంలోనే ఘటన

997views

పశ్చిమబెంగాల్లోని నంది గ్రామ్ సమీపంలో గల టెంటుల్ బరియా వద్ద ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త భార్యపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సోమవారం చోటు చేసుకుంది. టెంటుల్ బరియా నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాత్కాలిక నివాసానికి సమీపంలో ఉండడం విశేషం.

ఏప్రిల్ 1న నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నిక నిర్వహించబడుతుంది. మాజీ మంత్రి సువేందు అధికారి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీపై పోటీలో ఉన్నారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి బయటకి వెళ్లి తిరిగివచ్చిన బాధితురాలి భర్త ( బీజేపీ కార్యకర్త) తన భార్య అపస్మారక స్థితిలో ఇంటి వెనుక ఉన్న కాలువ వద్ద పడి ఉండడాన్ని చూశారు.

ఈ దారుణాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. “సాక్షాత్తు మహిళా ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్రాంతంలోనే ఇలాంటి దారుణాలు జరిగితే ఇక రాష్ట్రమంతటా మహిళలకు రక్షణ ఎలా లభిస్తుంది?” అని ఆయన ప్రశ్నించారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.