
869views
బెంగళూరులో జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (RSS) సర్ కార్యవాహ ఎన్నిక జరిగింది. ఇందులో శ్రీ దత్తాత్రేయ హోసబలే సర్ కార్యవాహ ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలంగా ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా ఉన్న శ్రీ దత్తాత్రేయ హొసబలే 2009 నుంచి ఆర్ ఎస్ ఎస్ సహ సర్ కార్యవాహ బాధ్యత నిర్వర్తిస్తూ ఉండినారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికలతో ఇప్పటివరకు సర్ కార్యవాహగా ఉన్న శ్రీ భయ్యాజీ జోషి స్థానంలో దత్తాజీ ఎన్నికయ్యారు. అఖిల భారతీయ ప్రతినిధి సభలలో పాల్గొనే ప్రతినిధులు సర్ కార్యవాహను ఎన్నుకుంటారు.





