News

నంద్యాల సంఘమిత్రలో స్వర్గీయ మల్లిఖార్జున శర్మ శ్రద్దాంజలి సభ

296views

స్వర్గీయ మల్లిఖార్జున శర్మ ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సంఘమిత్ర ఆవాసము (హాస్టల్) నందు శ్రద్ధాంజలి సభ జరిగింది.

మల్లిఖార్జున శర్మ గారు గత రెండున్నర దశాబ్దాల క్రితం చెంచు విద్యార్థుల కోసం భక్తకన్నప్ప ఆవాసం (హాస్టల్) ను ప్రారంభించారు. అలాగే చెంచుల కోసం మొబైల్ వాహనం ద్వారా వైద్య సేవలు అందించుట కొరకు మొబైల్ వాహనాన్ని ప్రారంభించినది కూడా వారే. పిల్లలకు స్వయం ఉపాధి శిక్షణ నేర్పించడంతో పాటు చెంచు గూడాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేవారు. వారి రిటైర్మెంట్ బెన్ఫిట్స్ అన్నీ ఆవాసానికే ఉపయోగించారు.

వారు చెంచులకోసం చేసిన సేవలను , సేవా భారతి జిల్లా అధ్యక్షులుగా అందించిన వైద్యసేవలను తలచుకొని సంఘ్ పరివార్ ప్రముఖులు వారికి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో విభాగ్ కార్యకారిణి సభ్యులు డాక్టర్ ఉదయ్ శంకర్ , విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ రాంప్రసాద్, నగర సంఘచాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ , కోశాధికారి శ్రీ నాగరాజయ్య, కార్యవర్గ సభ్యులు డా”అశోక్, శ్రీ రమణయ్య గౌడ్, నగర సహ కార్యవాహ శ్రీ బండారు సుబ్బారావు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీ Y N విష్ణువర్ధన్ రెడ్డితో పాటు వివిధ సంఘ్ పరివార్ సంస్థల జేష్ఠ కార్యకర్తలందరూ వారి సేవలను గుర్తు చేసుకొని నివాళులు అర్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.