
511views
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్ మజీద్ కుట్టీని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అరెస్టు చేసింది. 24 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న అతడిని జంషెడ్ పూర్ లో అదుపులోకి తీసుకున్నారు. 1997లో గణతంత్ర దినోత్సవం రోజున గుజరాత్, మహారాష్ట్రలలో పేలుళ్లకు దావూద్ పన్నిన కుట్రలో మజీద్ భాగస్వామి అని అధికారులు స్పష్టం చేశారు. 24 ఏళ్లుగా పరారీలో ఉన్న మజీద్ ఝార్ఖండ్ కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నివసిస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్లకు సంబంధించి 106 తుపాకులు, 4 కిలోల మందుగుండు, మరికొన్ని పేలుడు సామగ్రిని విక్రయించిన కేసులో మజీద్ నిందితుడు. ముంబయి పేలుళ్ల కేసులోనూ అతడు నిందితుడు.





