News

జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు : ముగ్గురు ముష్కరులు హతం : నలుగురు జవాన్లు వీరమరణం

557views

మ్మూకశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్‌ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి నుంచి భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. కాగా ఈ ఘటనలో నలుగురు జవానులు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని ఎల్‌ఓసీ వద్ద ముష్కరులు అక్రమంగా చొరబడేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. అనంతరం భద్రతా బలగాలు అక్కడ నిఘా పెంచాయి. కొద్ది సేపటికి అధికసంఖ్యలో వచ్చిన ముష్కరులు భారత సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. కాగా ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారితోపాటు ముగ్గురు జవాన్లు కన్నుమూశారు. ముగ్గురు ముష్కరులను హతమార్చినట్లు ఆర్మీ ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా వెల్లడించారు. ఎల్‌ఓసీ వద్ద కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.