News

నెల్లూరు జయభారత్ హాస్పిటల్లో లేబొరటరీ హాల్ ప్రారంభం

147views

సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ మల్లెల రామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్  కాలేజీ  భవనము లో లేబొరటరీ హాల్ నిర్మాణానికి శ్రీ సిద్ధవరపు మధుసూదన్ రెడ్డి గారు వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు దశరథరామిరెడ్డి  మరియు కామాక్షమ్మ గార్ల జ్ఞాపకార్ధం 10 లక్షల రూపాయలను సింహపురి వైద్య సేవా సమితి అధ్యక్షులు శ్రీ సీతారామ రెడ్డి గారి ద్వారా అందజేశారు. 7.11.2020 తేదీ శనివారం రోజున ఈ హాలు ప్రారంభోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ పొన్నలూరు సీతారామిరెడ్డి  గారు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సింహపురి వైద్య సేవా సమితి ద్వారా అనేక క ప్రాజెక్టు నిర్వహిస్తున్నామని దీంట్లో భాగంగానే జయభారత్ హాస్పిటల్  గిరిజనుల కొరకు ప్రత్యేక పది పడకల ఆసుపత్రి, బీఎస్సీ నర్సింగ్ కాలేజీ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, ఉచితంగా కంటి ఆపరేషన్ లు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలు అన్నీ దాతల సహకారంతోనే నిర్వహిస్తున్నామని, ఇలాంటి దాతలు  ఇంకా ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సింహపురి వైద్య సేవా సమితి ఉపాధ్యక్షులు శ్రీ బాలు సుబ్బారావు గారు, జి వి ఆర్ ఆర్ కళాశాల కరస్పాండెంట్ శ్రీ రామ దండు గారు, వాత్సల్య కార్యదర్శి శ్రీ సాంబశివ రావు గారు, మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీ జేపీ జైన్ గారు నర్సింగ్ కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.