News

ఆభరణాలను విక్రయించి ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కు విరాళమిచ్చిన నాసిక్ మహిళ

738views

న సాయుధ దళాలకు సంఘీభావం తెలిపే క్రమంలో నాసిక్ కు చెందిన డాక్టర్ నిషిగంధ మొగల్ తన ఇరవై లక్షల రూపాయల విలువైన ఆభరణాలను విక్రయించి, ఆ మొత్తాన్ని భారత సైన్యానికి పంపారు. ప్రారంభంలో, ఆమె తన బంగారు ఆభరణాలను సాయుధ దళాలకు విరాళంగా ఇవ్వాలనుకున్నారు. కానీ ఆభరణాల రూపంలో సైన్యం ఎటువంటి సహాయాన్ని అంగీకరించదు. కాబట్టి, ఆమె తన ఆభరణాలను అమ్మి ఆ మొత్తాన్ని విరాళంగా పంపారు.

రక్షణ శాఖ ఆమె సహాయం అందినట్లుగా రశీదు పంపింది. ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది. నిషిగంధ బిజెపి ఎమ్మెల్యే, ఆమె భర్త రాజాభావు మొగల్ నాసిక్ లో ఒక సీనియర్ స్వయంసేవక్.

భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ మరియు మిలిటరీ బోర్డు ఖాతాల విభాగం, కో-డైరెక్టర్, లెఫ్టినెంట్ కల్నల్ సౌమిత్రా మిశ్రా, డాక్టర్ నిషిగంధ మొగల్ కు కృతజ్ఞత తెలుపుతూ లేఖ పంపారు.

డాక్టర్ నిషిగంధ మొగల్ ఆర్మీకి వ్రాసిన లేఖలో….. “1999 లో కార్గిల్ యుద్ధం జరిగినప్పటి నుండి నేను భారత సైన్యం కోసం విరాళం ఇవ్వాలనుకుంటున్నాను. ఐదేళ్ల క్రితం నేను కార్గిల్‌కి వెళ్లాను. అక్కడి వాతావరణం చూసి నేను ఆశ్చర్యపోయాను. అటువంటి భయానక వాతావరణంలో, ప్రతికూల పరిస్థితులలో పోరాడటం ద్వారా ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. మన సైన్యం పట్ల మనకు బాధ్యత కూడా ఉంది. 55 తులాల బంగారం ధరను సైన్యానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను, అంటే 20 లక్షల రూపాయలు. దానిని ఇప్పుడు నెరవేర్చాను. నాకు భారత సైన్యం పంపిన స్పందన లేఖ చదవడం ద్వారా నేను సంతృప్తిగా ఉన్నాను.” అని ఆమె అన్నారు.

Source : Organiser.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.