
621views
బాణసంచా కాల్చడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ రాజస్థాన్, ఒడిశా ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం పళనిస్వామి గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో బాణసంచా ఉత్పత్తి ద్వారా ప్రత్యక్షంగా 4 లక్షల మంది, పరోక్షంగా మరో 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. బాణసంచా కాల్చేందుకు విధించిన నిషేధం కారణంగా ఉత్పత్తిదారులు, విక్రయదారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. దేశంలో బాణసంచా ఉత్పత్తిలో 90శాతం ఉత్పత్తి తమిళనాడులోనే జరుగుతోందని తెలిపారు. నిబంధనల ప్రకారమే బాణసంచా తయారు చేస్తున్నారని, దీనివల్ల కాలుష్య సమస్య ఏర్పడదని పేర్కొన్నారు. బాణసంచా కాల్చేందుకు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.





