
633views
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీసీ-49 నమూనా రాకెట్‌ను శ్రీవారి చెంత ఉంచారు. రేపు మధ్యాహ్నం శ్రీహరికోట షార్‌నుంచి పీఎస్‌ఎల్వీసీ-49 నింగిలోకి దూసుకెళ్లనున్నది. మనదేశానికి చెందిన ఈవోఎస్-01తోపాటు, విదేశాలకు చెందిన 9 ఉప్రగహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లనున్నది. దేశానికి చెందిన భూపరిశీలన ఉపగ్రహం ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ సమాచారం తెలుసుకోవచ్చు. వాహకనౌకకు రూ.175 కోట్లు, ఉపగ్రహానికి రూ. 125 కోట్ల వరకు వ్యయం చేశారు. ఈ ఏడాదిలో షార్ నుంచి ఇదే తొలి ప్రయోగం. కరోనా సవాళ్లను శాస్త్రవేత్తలు అధికమించి పీఎస్‌ఎల్‌వీ-సి49 వాహకనౌక ప్రయోగం చేస్తున్నారు.





