NewsSeva

శ్రీ మోహన్ భాగవత్ చేతుల మీదుగా సేవాభారతి “రక్త సేవ” యాప్ ఆవిష్కరణ

658views

రోజు నూతక్కిలో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత  సమావేశాలలో RSS సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. సేవాభారతి అభివృద్ధి చేసిన “రక్త సేవ” యాప్ ను ఆవిష్కరించారు. ఈ రక్త సేవ యాప్ ద్వారా కార్యకర్తను, రక్త దాతను, స్వీకర్తని అనుసంధానం చేసి ఎక్కువ మందికి  ఉపయోగపడేలా అభివృద్ధి చేశారని తెలియజేశారు.

“రక్త సేవ” యాప్ ఎలా పనిచేస్తుంది?

గూగుల్ ప్లే స్టోర్ నుంచి”రక్త సేవా యాప్” ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే… మీకొరకు గాని మీకు తెలిసిన వారికొరకు గానీ రక్తం/ ప్లేట్ లెట్స్/ ప్లాస్మా కొరకు అభ్యర్థన చేయవచ్చు.  అభ్యర్ధన చేసిన 3 గంటల లోపు దాతల నుండి అంగీకార  సమాచారం వస్తుంది. ఒకవేళ దాతల నుండి సమాచారం లభించనట్లయితే  కాల్ సెంటర్  040-4821-4920 కి ఫోన్ చేసినచో కాల్ సెంటర్ రక్త దాతలతో మాట్లాడి రక్తం అందేలా చూస్తారు అని పృధ్వీరాజు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో RSS క్షేత్ర సంఘచాలక్  శ్రీ నాగరాజు గారు( బెంగళూరు) ప్రాంత సంఘచాలక్ శ్రీ భూపతి రాజు శ్రీనివాస రాజు గారు, క్షేత్ర సహ సంఘచాలక్ శ్రీ దూసి రామకృష్ణ గారు పాల్గొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.