News

దీపావళికి ఆవుపేడతో తయారైన ప్రమిదలు

1.1kviews

దేశంలోని గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది దీపావళికి గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి ‘గోమయ దియా’గా పేరు పెట్టింది.

ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాడిరైతులు, గోశాల నిర్వాహకులు గోవు పేడతో తయారుచేసిన ప్రమిదలు సరఫరా చేయాల్సిందిగా  రాష్ట్రీయ కామధేను ఆయోగ్ పిలుపునిస్తోంది. ఇటువంటి పథకం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని, గో సంతతి వృద్ధితో పాటు వాటిపై ఆధారపడే వారికి ఆర్ధిక చేయూతనివ్వడం కూడా  రాష్ట్రీయ కామధేను ఆయోగ్ లక్ష్యాల్లో ఒకటి అని సంస్థ అధ్యక్షులు వల్లభ్ కటారియా పేర్కొన్నారు.

Source: Organiser & VSK TELANGANA.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.