News

చిన శేషవాహనంపై వెలుగులీనిన శేష శయనుడు

527views

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం ఉదయం చిన్నశేష వాహనసేవ జరిగింది. మురళీకృష్ణుడి అలంకారంలో స్వామివారు చిన్నశేష వాహనంపై కొలువుదీరారు. కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి వేదపారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు డీపీ అనంత కుమార్‌, శివకుమార్‌ తదితరులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. రాత్రి 7 నుంచి 8 గంటలకు హంస వాహనసేవ జరగనుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.