News

తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

633views

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా శ్రీవారి వాహన సేవలను ప్రారంభించారు. తొలి రోజు పెద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని ఆలయ మండపంలో కొలువుదీర్చి వాహన సేవ నిర్వహించారు. స్వామివారి వాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.

ధ్వజారోహణం

పెద శేష వాహనం

కలియుగ వైకుంఠ నాథుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు జరిగే పండుగే పెద శేషవాహన ఉత్సవం. ఆద్యంతం కన్నుల పండువగా సాగిన ఈ సేవలో శ్రీనివాసుడు శేషతల్పంపై అధిష్ఠించి దర్శనమిచ్చారు. స్వామి కొలువున్న కొండ శేషాద్రి. అందుకే తొలిరోజు పెద శేష వాహనంపై నుంచి భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. విషోగ్రుడైన శేషుని అధిష్ఠించిన దేవదేవుడు మానవుల్లోని కల్మశాన్ని హరిస్తాడన్నది ఈ సేవలోని అంతరార్థం. తిరు ఆభరణాల అలంకృతుడై ఉభయ దేవేరులతో కలగలిసి వీనులవిందు చేసే మలయప్పను దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.